బ్లూ స్క్రీన్ మైకం ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
నేనిప్పుడు చరవాణి పంజరాన
 బంధీనయ్యాను

నాకు సాంకేతిక మైకంకమ్మి
విలువైన సమయాన్ని

బ్రతుకును దిద్దే బడిని
 పాఠం చెప్పే గురువును ప్రక్కకు
పెట్టేశాను
బడికి డుమ్మా కొట్టి
అస్తమానము 
అంతర్జాలముతో అనుసంధానమైన
స్మార్ట్ ఫోన్ బ్లూ స్క్రీన్ పై
కొంగ్రొత్త అందాలను 
మంచి కన్నా ఈ పసి వయసులో చెడుకే బానిసలు తున్నా!?

విపరీతమైన కోపావేశం 
నాకే అంతుచిక్కని ఉద్వేగాలతో 
ఇతరులతో తగాదా పెడుతున్న

నాతో నేనే మాట్లాడుకుంటూ
ఒంటరితనాన్ని ఆశ్రయించి
నిద్రలేమితో మెమోరీ అంతాకోల్పోయిన

నా పేరేంటని నా ప్రక్కనున్న వాడినడిగే పరిస్థితి దాపురించింది

ఓ చరవాణి బానిసలా రా!
చరవాణికి దూరంగా ఉండండి
జీవితం గురించి తెలుసుకోండి
బడి కెళ్ళి చక్కగా చదువుకోండి
విలువైన సమయాన్ని
విలువైన జీవితాన్ని 
సద్వినియోగం చేసుకోండి
స్వల్పకాలిక ఆనందానికి తలొగ్గి నూరేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోకండికామెంట్‌లు