గంగమ్మ గంగమ్మ ఓహో గోదావరి గంగమ్మ ;-అంకాల సోమయ్య-:దేవరుప్పుల జనగాం -సేల్ 9640748497
పల్లవి 
గంగమ్మ గంగమ్మ ఓహో
గోదావరి గంగమ్మా2
మా ఆకలిదప్పులు తీర్చే తల్లి
గోదావరి గంగమ్మా2
చరణం 1 
కొండకోనల పచ్చదనము
నీవే కారణము2
ఆ కోయిల గొంతు లో
నవరాగమైశోభిల్లినావమ్మా2
/గంగమ్మ/
చరణం 2 
కృషీవలురకు కూడు గూడు
నీదయేతల్లి2
సకలప్రాణులకు ఆధారము
నీవే మాయమ్మ2
/గంగమ్మ/
చరణం 3 
పాడిపంటలకు పసిడిరాసులకు
నిలయం నీవమ్మా2
మానవ కోటి మనుగడ నీవే
మా తల్లి గంగమ్మ2
/గంగమ్మ/
పుణ్యతీర్థము
వెలిసినాయట
నదీతీరమందే
నవనాగరికత పరిఢవిల్లినది
నీ నదీపాయలందే
/గంగమ్మ/

కామెంట్‌లు