నీడలు-;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
నేను నీడను*
నేను   నిన్ను వెంటాడే అడుగుజాడను
నేను నీడను
నీ నడతను , నీ నడకను దిద్దే మార్గనిర్దేశకుడను
నేను నీడను
తప్పు ఉన్నచోట   ‌ నిప్పు ఉన్న చోట
నీ అడుగుల్ని సవరించు నిపుణుడను
నేను నీడను
కాల ప్రవాహంలో నువ్వు కొట్టుకెళ్ల వద్దని కాలానికి ఎదురీదమనీ *హితబోధచేస్తున్న వాడను
నేను నీడను
నీకు నేను మసక మసకగా కనిపించినా నీ భవిష్యత్తును దర్పణంలో చూపు తున్నవాడను


కామెంట్‌లు