అమ్మలేకపోతే;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
 అమ్మ లేకపోతే 
పిల్లలబ్రతుకెలాఉంటదంటే?!
మొండెం లేని తలలా!
చిరునామేలేని ఉత్తరంలా!
సంరక్షణలేని అడవి మొక్కలా!
వానకు తడుస్తూ--
ఎండకెండుతూ--
చలికి వణుకుతూ--
ఏడ్చీఏడ్చీనీరింకిపోయిన
కళ్ళతో--?!
ఆశగా అమ్మజాడకై
ఎదురుచూసే
లేగదూడలా--!?
చిట్టి చిలకమ్మలా--!?
కొండకెదురుచూసినట్టు
చూసేటి నిర్భాగ్యులు
కసాయి మృగాడి
 కర్కశత్వానికి
బలైన 
ఓ అబల
విడిచి వెల్లిన 
మౌన సాక్ష్యంగా---!?


కామెంట్‌లు