'మొలకె'త్తిన పద్యం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు 9849305871
ఊహకు రూపం పొదగడం 
ఆశకు ఊపిరి పోయడం ఒక్కటే
వేరువేరు క్రియలు కాదు

ప్రేరణ స్ఫురణ ధారణ ఆవరణ అవధాన జానర్ జాహ్నవి

బీజం మొలకై ఎదగడం
'మొలక' ఎత్తుకున్నదే ఓ జీవ కావ్యం 

అక్షరానికి అక్షరం కూడితే ఒక మాట
మాట మాటతో చేరినా వీడినా లెక్కల  సమాసం 
ఊగి తూగే సమస్య సాధనే బతుకు బీజగణితం 

రాకపోకలు లేని ప్రయాణం
ఒంటరి
ఇచ్చిపుచ్చుకోలేని బంధాలు ఏకాకి మూసిన కిటికీలు తెరువని స్థితి
ఇరుగూ పొరుగు అనువాదం నీలోకి తెరుచుకొను బయటి ప్రపంచ ద్వారం

ఆలోచన సామాజిక స్ఫూర్తి సృజన 
కొత్తకొత్తగా 
తెల్లకాగితం రాసిన కవిత్వపు మొలక
ఆత్మీయ గౌరవం సాహిత్య కరచాలనమై వెలిగే 
పద్యం మొలకెత్తే చెట్టునీడల

ఎక్కడా మెరువని దానికి 
మొలక పిలుపు ఆనందమైంది 
ఆత్మీయ అక్షరబంధం ఊయలలూగే
విరి తావి పరిమళం తేలే గాలిలో 
కృతజ్ఞతల కవిత్వమై 


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
అద్భుతమైన అనుభూతుల వ్యక్తీకరణ. కవీశ్వరులకు "మొలక " పై గల ప్రేమ విశ్వాసం, మొలక సాధించగల జీవన సాఫల్యం అంతా హృదయానుభూతి ఠో కవిత రూపంగా ప్రకటించడం ఒక వినూత్న కళ. కంగ్రాట్స్ to the poet