మన చెల్లె మన బంధం *;- ప్రభాకర్ రావు గుండవరం(మిత్రాజీ )ఫోన్ నం.9949267638
చెల్లె మన తొడబుట్టు 
చెల్లె మన రక్త బంధం 
తల్లిలా లాలించు 
తండ్రిలా అనునయించు 
అనుబంధం ఆత్మీయత
కలబోసిన కరుణామయి 

అధికారం చెలాయించు 
కోరినది తెమ్మని పట్టుబట్టు 
మనకు బాధయితే తనే ఏడ్చు 
మన దుఖాన్ని ఓదార్చు 

భయపెడితే భీతితో 
వెక్కి వెక్కి ఏడ్చుచుండు 
కోప్పడితే అమ్మ కొంగు 
చాటున దాగుండి నవ్వు 

మర్యాదలో తీసికట్టు 
అన్ని పనుల్లో తానే ఫస్ట్ 
అందరితో ఆత్మీయతను 
అందుకునే ఆణిముత్యం 

మన అనురాగం చెల్లె 
మన ఆప్యాయత చెల్లె 
మన గుండె మన చెల్లె 
వేదం జ్ఞానం మన చెల్లె

కామెంట్‌లు