చదువు ;- సన తబస్సుమ్- తొమ్మిదవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనపూర్-మెదక్ జిల్లా -చరవాణి: 9959730286
   అనగనగా బాలానగర్ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న అడవి ఉండేది. అడవిలో జంతువులు, పక్షులు జీవించేవి. సోమేశ్ అనే వేటగాడు ప్రతిరోజు చెరువులో చేపలను పట్టుకువెళ్లేవాడు. అలాగే పక్కనున్న అడవిలోకి వెళ్లి చిన్న చిన్న జంతువులను వేటాడి జీవించేవాడు. 
           సోమేశ్ కు ఒక్కగానొక్క కుమారుడు రాకేష్ పదవ తరగతి చదువుతున్నాడు. రాత్రి పగలు బాగా చదువుతూ ప్రతిరోజు బడికి వెళ్లేవాడు. ప్రతిసారి రాకేష్ ను తండ్రి సోమేష్ తనతో అడవికి వచ్చి జంతువులను వేటాడి జీవించమని, తాను జంతువులను ఎలా వేటాడాలో నేర్పుతానని అనేవాడు. కానీ రాకేష్ తాను బాగా చదువుకొని గొప్ప డాక్టర్ ను అవుతానని అనేవాడు. డాక్టర్ చదివి ఏం చేస్తావ్..‌ నాతో బ్రతకడం నేర్చుకో అంటూ సోమేష్ వెళ్లేవాడు. రాకేష్ మాత్రం బాగా చదువుకునేవాడు.
          ఒకరోజు రాకేష్ ను తండ్రి సోమేశ్ అడవికి తీసుకెళ్తాడు. సోమేశ్ అడవిలో వేటాడే సమయంలో పట్టు తప్పి బాగా గాయాల పాలవుతాడు. రాకేష్ బాగా అరిచి జనం సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. అందరూ సోమేశ్ చనిపోయాడని అనుకుంటారు. కానీ డాక్టర్ చక్కని వైద్యం మూలంగా సోమేశ్ బ్రతుకుతాడు. అందరూ సంతోషపడతారు. 
            తర్వాత రాకేష్ ను బాగా చదివించి, తండ్రి సోమేశ్ గొప్ప డాక్టర్ గా చూడాలనుకుంటాడు. రాకేష్ కూడా బాగా చదువుకొని డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. చాలామందికి వైద్యం చేసి రాకేష్ ప్రాణాలు కాపాడుతుంటే, తండ్రి సోమేష్ ఆనందించసాగాడు. అలాగే ప్రాణాలు తీసి జంతువులను చంపడం మహా పాపమని జంతువుల వేట మానేస్తాడు. 

నీతి: మనిషి ఆలోచనలు ఎప్పటికైనా మంచి మార్గం వైపు నడిపిస్తాయి.


కామెంట్‌లు