కోకిల సందేశం- -గద్వాల సోమన్న,9966414580
నల్లని కోకిలమ్మ
చెట్టుపై వాలింది
చక్కని గాత్రంతో
తీయగా పాడింది

మావి చిగురు తిని తిని
ఉత్తేజం పొందింది
పట్టరాని ముదంతో
మత్తుగా కూసింది

చెట్టంతా తిరిగింది
అటూఇటూ చూసింది
విన్న వారి చెవులలో
అమృతమ్ము పోసింది

మేనులో రంగు కన్న
గుణమే గొప్పదంది
ప్రతిభాపాటవాలు
చూపిన గౌరవమంది

ఇదే ఇదే  కోకిల
పంపిన సందేశం
మన క్షేమం కోసం
అందిన ఆదేశం


కామెంట్‌లు