కష్టాలు కలకాలం ఉండవు!!;- -గద్వాల సోమన్న,9966414580
సుడిగుండాలేర్పడినా
యమ గండాలు వచ్చినా
భీతిల్లకు ఓ మనసా!
ఈతిబాధలు తాకినా

నమ్మిన వారు ముంచినా
వెన్నుపోటు పొడిచినా
చింతించకు ఓ మనసా!
నష్టమే వాటిల్లినా

విషమ పరిస్థితులలో
ధైర్యాన్నే కోల్పోకు
నష్టాల వేళల్లో
కంట తడి పెట్టబోకు

అమావాస్య చీకట్లు
కలకాలం ఉండవుగా!
జీవితంలో  కడగండ్లు
ఆవిరై పోవునుగా!


కామెంట్‌లు