శ్రీ విష్ణు సహస్రనామాలు(బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
821)శత్రుతాపనః -

విరోధులను తపింపజేయువాడు 
శత్రువులను దండించుచున్నవాడు 
సజ్జనులకు సాయమున్నవాడు 
దేవతా విరోధులనణుచువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
822)న్యగ్రోధః -

సర్వభూతముల శాసనకుడు 
మాయతో ఆవరింపజేయువాడు 
మర్రి చెట్టువలే విస్తరించువాడు 
న్యగ్రోధ నామమున్నట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
823)ఉదుంబరః -

అన్నముతో పోషించుచున్నవాడు 
విశ్వప్రాణులకాహారమిచ్చువాడు 
జీవశక్తికి సాయపడుచున్నవాడు 
ఉదుంబర నామమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
824)అశ్వత్థః -

అశాశ్వతమైన రూపమున్నవాడు 
సంసారవృక్షము వంటివాడు 
కుటుంబశాఖల విస్తరించువాడు 
అశ్వత్థ నారాయణు డనువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
825)చాణురాంధ్రనిషూధనః -

చానూరుని చంపినట్టివాడు 
మల్లయోధులనోడించినవాడు 
మధురలో గెలిచినట్టివాడు 
కంసమాయ తొలిగించినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు