శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
936)చతురస్రః -

జీవులకు కర్మఫలమిచ్చువాడు 
న్యాయముగా పంచుచున్నట్టివాడు 
కర్మలవిభజనము చేయువాడు 
చతురస్ర నామధేయమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
937)గభీరాత్మా -

గ్రహింప శక్యముగానట్టివాడు 
స్వరూపమెరుగలేకున్నవాడు 
గంభీర స్వభావమున్నట్టి వాడు 
ఆత్మజ్ఞానం తెలుపగలవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
938)విదిశః -

అధికారులకు ఫలమిచ్చువాడు 
ప్రత్యేకతను కలిగించెడివాడు 
శ్రమించిన ఫలితము చూపువాడు 
కర్మఆచరణ శక్తినిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
939)వ్యాధిశః -

అర్హతలు బట్టి నియమించువాడు 
కర్మలను ఆజ్ఞాపించుచున్నవాడు 
ప్రాణి చేతనము కలిగించువాడు 
కర్తవ్యము సూచించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
940)దిశః -

వేదము ద్వారా జ్ఞానమిచ్చువాడు 
కర్మఫలితం ప్రసాదించువాడు 
ముఖ్య మార్గదర్శనమయినవాడు 
దిశా నిర్దేశనమును చేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
(సశేషము )

కామెంట్‌లు