సుప్రభాత కవిత ; -బృంద
మదిలోని గదులన్నీ
మమతతో నిండిపోగా
హృదయాంతరాళాన
తెరలు తొలగిపోగా....
మనసుపొరలను
ఒకటొకటిగా కరిగించి....

దాచిన కలలన్ని రెప్పవిప్పి 
మనసారా కన్నులింతగ చేసి
తెలియని సంతోషపు సంబరాన 
ఆనందపు తరగల తేలిపోగా..

కనిపించని చిక్కుముళ్ళు
వేటికవే విడిపోయి అబ్బురంగా...
ఎండిన బీడు నేలను
దండిగ వాన కురిసి తడిపినట్టూ..

మొండిగ మారిన హృదయాన
ప్రేమ మొలకలుగ పుట్టినట్టూ
మండే గుండెకు అమృతపు
ధార కురిసి తడిసినట్టూ....

అపేక్షలు వెల్లి విరియ హాయిగా
ఉపేక్షలు మరచిపోయి శాంతంగా
ఆకాంక్షలు  తీరేలా కమ్మగా
నిరీక్షణ ఫలించిన నిజంలా

ఏతెంచే వేకువకు 

🌸🌸 సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు