శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
876)విహాయనగతిః -

ఆకాశము తానయిఉన్నవాడు 
ఆశ్రయమును ఇచ్చుచున్నవాడు 
విష్ణు పథము తానయినవాడు 
విహాయనగతి నిచ్చుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
877)జ్యోతిః -

స్వయంప్రకాశము గలిగినవాడు 
లోకముల వెలిగించుచున్నవాడు 
తననుండి వెలుగందించువాడు 
తేజస్సును ప్రసాదించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
878)సురుచిః -

అందమైన రూపముగలవాడు 
సురుచిర సుందరుడైనవాడు 
చిన్మయమైన ఆకృతిగలవాడు 
చక్కని దేహసౌష్టవమున్నవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
879)హుతభుక్ -

హవిస్సులు స్వీకరించుచున్నవాడు 
యజ్ఞమునందు పాల్గొనువాడు 
ఆవాహనము చేయబడుచున్నవాడు 
హుతభృక్ నామము గలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
880)విభః -

సర్వలోకములకునూ విభుడు 
ప్రభువుగా నుండినట్టివాడు 
పాలకుడు తానయివున్నవాడు 
పరిపాలనము చేయుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు