శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
901)స్వస్తిదః -
===========
శ్రేయోభిలాషయైనట్టి వాడు 
శుభకార్యక్రమములు చేయువాడు 
క్షేమములు దయచేయుచున్నవాడు 
స్వస్థతను చేకూర్చుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
902)స్వస్తి కృత్ -

శుభములు కూర్చుచున్నట్టి వాడు 
మంచిజీవితము నొసగువాడు 
స్వస్తివచనముతో దీవించువాడు 
శుభకృత్యములు చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
903)స్వస్తిః -

సర్వమంగళ స్వరూపుడైనవాడు 
శుభకరముల నొసగువాడు 
నెమ్మదిగా నుంచుచున్నట్టి వాడు 
మంగళములు ప్రసాదించువాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
904)స్వస్తి భుక్ -

శుభముల అనుభవకారకుడు 
క్షేమలాభముల నొసగువాడు 
జయానుభవము నొసగువాడు 
స్వస్తి భుక్ అను నామధేయుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
905)స్వస్తి దక్షిణః -

స్మరణముతోడ శుభమిచ్చువాడు 
తలచినంతనే అభయకరుడు 
శుభములు దక్షిణగా నిచ్చువాడు 
మంచిని ప్రసాదించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు