వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి.
 మనం ప్రతి రోజు హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాం అని అనుకుంటాం  కానీ వేదాంతం చెప్పే మాట  ఏ రోజుకు ఆ రోజు జీవితం తరిగిపోతూ ఉంటుంది  సుఖాలకు దూరంగా ఉంటాం  దీనికి ప్రధాన కారణం నీ మనసు దానిని నీ స్వాధీనంలో ఉంచుకో  అని చెబుతారు  మనలోకి చేరిన కోపం అసూయాద్వేషం మోసం ఇలాంటివన్నీ  సంవత్సరాలుగా మనలోనే ఉంటే నిత్య రోగగ్రస్తులవుతాం  మనం నిత్యం  రకరకాల ఆలోచనలతో మనసును వికలం చేస్తాం  మనలో ఉన్న కోపాన్ని ఒత్తిడిని ద్వేషాన్ని బద్దకాన్ని అనారోగ్యాన్ని  రాకుండా చేయాలి అంటే నిత్యం నీవు ధ్యానం లేక యోగా చేయడం  సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి  మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణశక్తిని చేసే ఏకైక మార్గం ధ్యానం యోగాలు రోజు కనీసం అరగంట యోగ ప్రాణాయామం ధ్యానం చేస్తే  ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా నిండు నూరేళ్లు  ఎలాంటి కలతలు లేకుండా జీవిస్తాం  ప్రయత్నించండి.మానవుని ప్రాథమిక దశ  దిగంబరంగా స్త్రీ పురుష బేధం తెలియకుండా అడవులలో  కొండలలో ఏది కనిపిస్తే దానిని తింటూ కడుపు నింపుకొని జీవితాన్ని కూడా సాగించినవాడు  వేటను ఆధారం చేసుకొని జీవితాన్ని గడిపిన వారు  రాళ్లూరప్పల్లో తిరుగుతూ ఆకులు అలములను తింటూ  ప్రశాంతంగా జీవిస్తున్న దశ  సిగ్గు తెలిచిన తర్వాత బట్టలు ఎలా వేసుకోవాలో ఆకులతో ప్రారంభమైంది వారికి జీవితం  ఆకులు తింటూ బ్రతికిన వాడికి ఆకులలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటో అర్ధమయినాయి  వాటిని అనేక రకాలుగా ఎలా వాడాలో తెలుసుకున్నారు  అలా తనకు తన కుటుంబానికి మిగిలినవారికి ఆరోగ్యాన్ని  అందచేసే ఆకులను  పూజించారు.చెప్పులు కూడా లేకుండా రాళ్లు రప్పలు అనకుండా  తిరుగుతూ ఉన్న సమయంలో  ఆ రాయిని ఉపయోగించి  దానిలో ఉన్న శిల్పాన్ని బయటకు తీసిన వాడు  తన  మేధాశక్తితో  భగవత్ స్వరూపాన్ని కూడా దానిలో  చెక్కిన  శిల్పకారుడు గా తయారయ్యాడు  లోహం అంటే ఏమిటో తెలియకుండా బ్రతికి  ఆలోహంలో ఉన్న పదార్థాన్ని అర్థం చేసుకుని  దానితో అందమైన ఆభరణాలు ఎలా చేయవచ్చును  అన్న విషయాన్ని గ్రహించాడు స్త్రీ పురుష భేదాలు లేకుండా ప్రతి వారికి ఆనందంగా  అందంగా కనిపించేలా  ఆభరణాలను  తయారు చేయడంలో కూడా ఎన్నో మెలకువలు చూపి  ఆకర్షణ గా ఉండడానికి కూడా ప్రయత్నం చేశాడు అలా లోహాన్ని అందమైన వస్తువుగా తయారు చేయడం నేర్చుకున్నాడు మానవుడు.
-----------------------------------------
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు