భావన;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నిజమైన ప్రేమ
విద్యుత్ ప్రవాహంలాంటిది కదూ!
యుగాంతాల నిండా
దిగాంతాల నిండా
నీకోసం జీవించే
కన్నీటి చుక్కనవుతాను
కనురెప్పల , కనకాంబరాల
తుషారబిందువుల మీద
ఉఛ్ఛ్వాస నిశ్వాసల
జీవితపు వెలుగునవుతాను
ప్రియతమా!
నన్ను ఎండమావుల్లో 
సేదదీరనివ్వకు
గుండె మావితోటలో
గుబాళింపులు నేను కోరలేదు సుమా!
నీ జీవనాకాశపు వీధుల్లో
బిందువునయినా చాలు
సుదూర వని లాంటి ఆశకు
నన్ను దూరం చేయకు
బతుకు భారం చేయకు 
మమతకు మాధుర్యానికీ 
భాషలేదు కదూ!
ఏదో నా మానాన నేను 
గొణుక్కుంటున్నాను
అయినా నా భావన
నీ హృదయానికి తెలుస్తుందిలే !!
**************************************

కామెంట్‌లు