శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
796)వాజసనః -

అర్థించువారిని బ్రోచుచున్నవాడు 
ఆహారమిచ్చి ఆదుకొనువాడు 
పోషణము చేయుచున్నవాడు 
వాజసన పేరున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
797)శృంగీ -

శృంగము గలిగినట్టి వాడు 
శిఖను పొందియున్నవాడు 
కిరీటధారణము చేయువాడు 
ఘన శృంగమున్నట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
798)జయంతః -

సర్వవిజయాలకు కారకుడు 
జయములు కలిగించువాడు 
శుభములకారకుడైయున్నవాడు 
జయంత నామమున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
799)సర్వ విజ్ఞయీ -

సర్వమూ తెలిసినట్టి వాడు 
జ్ఞానవంతుడు అయినవాడు 
మేధోవంతుడు అయినవాడు 
కర్మాచరణము తెలిసినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
800)సువర్ణ బిందుః -

బంగారం వంటి మేనున్నవాడు 
పసిడి అవయవములున్నవాడు 
సువర్ణపు పూత గలిగినవాడు 
కరిగిన పసిడి మెరుపున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు