భాగ్యనగరం లో కవి, రచయిత "అయ్యలసోమయాజుల" కు ఆత్మీయ సత్కారం.
    భాగ్యనగరం లో విమల  సాహితీ సమితి    అధ్యక్షులు సాహితీ వేత్త కవి డాక్టర్ జెల్ది విద్యాధర్  ఐ .ఆర్.ఎస్. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన  రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం లో కవి, రచయిత ,సాహిత్యరత్న  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి ,విశాఖపట్నం 
"పరమేశ్వరుని ప్రతిరూపమే పితృదేవులు" అన్న కవితను గానం చేయగా  విశిష్ట అతిధి , ప్రముఖ కవి,నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కవిరత్న డాక్టర్ బిక్కి కృష్ణ, ఆచార్య జి.వి రత్నాకర్,అనువాద రచయిత సమీక్షకులు శ్రీ కొండపాక రవీంద్రాచారి, గౌరవ అతిథిలు శ్రీ కె.శ్రీనివాస గౌడ్, శ్రీ సరికొండ నరసింహరాజు ,కుసుమ ధర్మన్న సాహితీ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ రాధా కుసుమ గారు సమక్షంలో   సిటీ కల్చరల్ సెంటర్  సభా ప్రాంగణములో  ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది
కవులు పోలయ్య, కాదంబరి కృష్ణ ప్రసాద్, నంది పురస్కార గ్రహీత డాక్టర్ దీపక్ న్యాతి,శ్రీమతి సత్యవేణి మొండ్రేటి, శ్రీమతి శోభాదేశ్ పాండే మున్నగు వారు  ,సాహితీ అభిమానులు సభ లో పాల్గొన్నారు
ఈ సంధర్భంగా  డాక్టర్ విద్యాధర్ గారి అంతరంగపు భాష, తోటమాలి మాలిమి పుస్తకాల  ఆంగ్ల అనువాద ఆవిష్కరణ  కూడా జరిగింది. కవి సమ్మేళనం  డాక్టర్ రాధా కుసుమ గారి ఆధ్వర్యంలో ,కళారత్న బిక్కి కృష్ణ గారి పర్యవేక్షణ లో   సరస్వతీ సభ ఆద్యంతం ఘనంగా జరిగింది.

కామెంట్‌లు