నాన్న ;- జయా
"నువ్వెక్కడ బాగుపడతావురా?" అని తిట్టి ఎప్పుడు బాగుపడతాడోనని నిండు హృదయంతో తపించే అతనే నాన్న...!!
 
అధికశాతం నాన్న మన కోసం కొనుక్కొచ్చే ప్రతి వస్తువూ నాన్నకు ఆయన రోజుల్లో ఆయనకు 'అందని ద్రాక్షే" అయ్యుంటాయి!!

పాతబడిపోయిన నాన్న కళ్ళజోడుని  పెట్టుకున్నప్పుడు భూతాకారమైకనిపించింది మాకోసం నాన్న కోల్పోయిన జీవితం!!

తను జోకరులా వేషం వేసుకుని తన కొడుకునో కూతురినో నవ్విస్తూ ఆడుకునే నాన్నను పాందడం పిల్లలకు నిజమైన వరం!!

చివరి వరకూ అర్థం చేసుకోలేని నాన్నను
అర్థం చేసుకున్నప్పుడు చదువుదామంటే దొరకని పుస్తకంలా మారిపోతారు నాన్న!!

'తిన్నావుగా' అనేది అమ్మ ప్రేమైతే 'తిన్నాడాని అడుగు' అనేది నాన్న పాశం!!

నొప్పెట్టని విధంగా కొట్టి నిద్రపుచ్చేది అమ్మ...
నొప్పెట్టేలా కొట్టి అయ్యో కొట్టాసానే అని నిద్ర పట్టక తల్లడిల్లేది నాన్న!!

కొడుకునో కుమార్తెనో కొడితే వారు నిద్రపోయిన తర్వాత వారి పక్కనే కూర్చుని బాధపడటం నాన్నలో చూడొచ్చు. ఇది వెయ్యి తల్లుల పాశానికి సమం!!

ఒక్క మాటలో కవిత చెప్పమంటే అది "అమ్మ"!!

 ఒక్క మాటలో చరిత్ర చెప్పమంటే అది "నాన్న"

చదువు పూర్తి చేసుకుని రోడ్డున పడి తిరిగేటప్పుడు నాన్న చెమటేమిటో తెలిసొస్తుంది కొడుక్కి!!

అయిదో ఏట "కథానాయకుడి"గా
ఇరవయ్యో ఏట "ప్రతినాయకుడి"గా
యాభయ్యో ఏట దైవమవుతాడు "నాన్న"

తనకంటూ ఏ ఆశా లేకుండా బిడ్డ ఆశలను దత్తత చేసుకుని వాటిని తీర్చడంకోసం శ్రమించే నాన్నను మించిన ఐశ్వర్యాన్నా అక్షయ తృతీయ ఇవ్వగలదు??

నాన్న జ్ఞాపకాలు పిల్లకు ఆలస్యంగా తెలుస్తాయి. బోధపడతాయి. కానీ అప్పటికి నాన్న ఉండరు. ఆయన శ్రమా తపనా పదే పదే గుర్తుకొచ్చి వేలు పట్టుకుని నడిపిస్తుంటాయి !!

 🌿🌿 జయా 🌿🌿

కామెంట్‌లు