శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది)-ఎం. వి. ఉమాదేవి
891)అగ్రజః -
==========
సృష్టికీ ముందే అవతరణకుడు 
అనాదినుండీ యున్నట్టివాడు 
అగ్రజుడుగానే వెలసినవాడు 
సృష్టి ప్రారంభము చేసినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
892)అనిర్వణ్ణః -

నిరాశను ఎరుగనట్టివాడు 
నిర్విణ్ణత లేకయుండువాడు 
దేనికినీ చలించని స్వభావుడు 
అనిర్వణ్ణా నామమున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
893)సదామర్షీ -

సజ్జనులను క్షమించగలవాడు 
భక్తులదోషాలను హరించెడివాడు 
సదా ఓర్పుతో యున్నట్టివాడు 
పాపములు మర్షణము చేయువాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
894)లోకాధిష్టానం -

ప్రపంచంలో ఆధిపత్యమున్నవాడు 
విశ్వ అధిష్టానదేవతైనవాడు 
ఆజ్ఞలను ఇచ్చుచున్నట్టి వాడు 
లోక పరిపాలనచేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
895)అద్భుతః -

ఆశ్చర్య స్వరూపుడైనవాడు 
నమ్మలేని ఘనతయున్నవాడు 
మునుపులేనట్టి విధమైనవాడు 
అద్భుతకర స్వామియైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు