సుప్రభాత కవిత ; - బృంద
నడవక తప్పని గమనం
గడవక తప్పని తరుణం
జడవక సాగనీ పయనం
విడువక తోడుండు దైవం!

వదలక పెంచుకో నమ్మకం
చెదరక ఉంచుకో ధైర్యం
బెదరకు ఏదైనా పరిణామం
చివరకు నీదే విజయం

వడి ఎంతగా పెరిగినా
జడి ఎంతగా కురిసినా
ముడి ఎంతగా బిగిసినా
సడిలేక సమస్య తీరే పోవును

వేదన మాసిపోయేలా
కలతలు కరిగిపోయేలా
వెతలు మాయమయేలా
సాయం తప్పక దొరికేను

రేపటికోసం ఎదురుచూస్తూ
మాపును మొత్తం గెలిచేయ్
ఆపకు అడుగుల వేగం
అదిగో వెలుగుల తీరం....

వెతలు తీర్చే వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు