నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ
 దెయ్యాల ప్రేతాత్మలున్నాయని కొందరు ఇప్పటికీ నమ్ము తారు.ప్రపంచంలో అలాంటి సంఘటనలు జరుగుతాయి అని కొంతమంది నమ్మకం.మన తెలుగు జానపద కథలు సినిమాలు కూడా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా!? ఫ్లైయింగ్ డచ్ మాన్ అనే ఓడని గూర్చి ఎన్నో కథనాలు వచ్చాయి.అందులో ఒకేఒక్క కంకాళం ఉందిట.బిల్డిగులు కోటలు బురుజులు సరస్సులు కూడా ప్రేతాత్మలు దెయ్యాలు భూతాలు తో ఉంటాయి అని కథనాలు!బార్బరా కార్ట్ లాండ్ అనే రచయిత్రి ఓసారి అలాంటి బురుజులు ఉన్న చోట నడుస్తూ ఉంటే అబ్బా! అద్భుతంగా ఉన్నాయి అని అనుకుంది.కానీ ఆమె వెనుతిరిగి వచ్చే ప్పుడు అవి కన్పడలేదుట! ఆకాజిల్ భవంతి ఎలా మాయమైంది!? అలాగే పెంపుడు జంతువులు కూడా భూతాలు గా మారి మనల్ని వెన్నాడుతాయిట.చనిపోయిన పెంపుడు పిల్లి ఆడుకునే బంతి హఠాత్తుగా మెట్లపై నుంచి దొర్లుకుంటూ రావటం ఇంట్లోవాళ్ల పాదాలని రుద్దుతూ ఉన్న స్పర్శ కల్గుతుంది కానీ చూస్తే ఎవరూ కన్పడరు.ఒకస్వీడిష్ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాత 1959లో పిట్టలకూతలు అరుపులు రికార్డు చేశాడు.కానీ తన చనిపోయిన మిత్రులు బంధువుల కంఠస్వరాలు అందులో వినపడ్డాయి అని చెప్పాడు.కానీ అవన్నీ ఎలక్ట్రానిక్ రికార్డింగ్స్ కాబట్టి పూర్తిగా నమ్మలేం అని ఆవ్యక్తి బుర్రలో  పదేపదే అవి తిరుగుతూ ఉంటే అలాంటి ఫీలింగ్ వస్తుంది అని కొందరివాదన🌹

కామెంట్‌లు