సుప్రభాత కవిత ; -బృంద
విసుగెత్తి వేసారిన మనసుకు
ఊరటగా వచ్చే వేకువ

వంచనలతో మునిగిన 
బ్రతుకుల ఆసరాగా వచ్చే వేకువ

అట్టడుగుకు జారిన విలువలకు
ఊపిరి పోసే వేకువ

వేధించే కలతల వెతలకు
చరమగీతం పలికే వేకువ

ఎగసే భావాల ఊహలకు
ఊతమిచ్చే వేకువ

దిగజారిన కీర్తి పతాకకు
చేయూత నిచ్చే వేకువ

స్వేఛ్ఛగా ఎగిరే రెక్కల చప్పుడు
విజయగీతమయ్యే వేకువ

పాలమబ్బులు పసిడి పువ్వులు
వానగా కురిపించే వేకువ

వేలుపులు వరుసగా నిలిచి
దీవెనలందించే వేకువ

నింగిన పొంగిన రంగులతో
ముంగిలి మురిపించే వేకువ

మండే ఎండకు మల్లే రగిలిన
మనసుకు సాంత్వన తెచ్చే వేకువ

ఎదురుచూసిన మనసుకు 

మధురంగా వెన్నెలవల పరిచే వేకువ

కాలం కాటుకు గురైన నేలకు
కొత్త జీవం పోసే వేకువ

మహోదయ శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు