కవితాసూక్ష్మం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవిత
తట్టింది
కలాన్నిపట్టించింది
కాగితాన్నినింపించింది

కవిత
పుట్టింది
చేతుల్లోకివచ్చింది
పరవశాన్నిచ్చింది

కవిత
ఊరింది
ఉద్వేగపరచింది
ఉబలాటపరచింది

కవిత
పొంగింది
అబ్బురపరచింది
ఆనందంకూర్చింది

కవిత
పారింది
అక్షరాలుప్రవహించాయి
పదాలుచెరువులోనిలిచాయి

కవిత
పూచింది
చక్కదనాలుచూపింది
సుగంధాలుచల్లింది

కవిత
కోరింది
కమ్మగాకూర్పించింది
కుతూహలాన్నిపంచింది

కవిత
కురిసింది
కాలవల్లోపయనించింది
కుంటల్లోకాపురంపెట్టింది

కవిత
లభించింది
చక్కగాచదివించింది
చిత్తాన్నిదోచేసింది

కవిత
కనిపించింది
కవనలోకాంలోకితీసుకెళ్ళింది
కవిత్వరుచులనుతినిపించింది

కవితాసూక్ష్మాలను
తెలుసుకుందాం
పాఠకులమనసులను
దోచుకుందాం


కామెంట్‌లు