సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -546
తృణాగ్ని న్యాయము
    ******
తృణ అంటే గడ్డి , ఎండు గడ్డి.అగ్ని అంటే నిప్పు , అగ్ని దేవుడు యాగాగ్ని, జఠరాగ్ని అనే అర్థాలు ఉన్నాయి.
ఎండు గడ్డి  ముక్కలు లేదా చిన్న చిన్న ఎండు పుల్లలను చితుకులు అంటారు.ఈ చితుకులతో వెలిగించిన నిప్పు క్షణంలో నశిస్తుందని అర్థము.
చితుకుల నిప్పు లేదా మంట ఎక్కువ సేపు వుండదు.ఒక్కసారే బుస్సుమని పైకి మండి చప్పున ఆరిపోతుంది. దాని వల్ల వంటకు ఎలాంటి ఉపయోగం ఉండదు.అలాంటి చితుకుల మంటకు సంబంధించినవి  తెలుగులో  ఓ రెండు  సామెతలు వున్నాయి.అవేమిటో చూద్దాం.
"బానకింద చితుకుల మంట -బుద్ధి హీనుడి నవ్వు వ్యర్థం " అంటే వంట చేయడం కోసం పెద్ద బాన లేదా పాత్రను పొయ్యి మీద పెట్టి కింద చితుకుల మంట వెలిగిస్తే ఏమీ ఉపయోగం వుండదు. వెంటనే ఆరిపోయే మంట వల్ల బాన వేడెక్కదు. చేయాల్సిన వంట పూర్తి కాదు.ఆ మంట  వ్యర్థం అన్న మాట.
మరి  దీనికి బుద్ధి హీనుడి నవ్వును ఎందుకు జోడించారో తెలుసుకుందాం.
 అసందర్భమైన నవ్వు అపార్థాలకు దారి తీస్తుంది.నలుగురు ఉన్నప్పుడు ఎవరైనా నవ్వారంటే మిగతా వారు ఆ నవ్వు గురించి నానా రకాలుగా ఊహిస్తారు.ఆలోచిస్తారు.అలా సమయం, సందర్భం తెలియని బుద్ధి హీనులు నవ్వుతారని మన పెద్దలు అంటుంటారు. 
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.
రావణ సంహారం పూర్తి అయిన తరువాత  అయోధ్యకు తిరిగి వచ్చిన రాముల వారు కుటుంబ సమేతంగా సభలో కొలువు తీరి ఉన్నారు.
ఆ సమయంలో లక్ష్మణుడు చిన్నగా నవ్వుకోవడం సభలోని వారందరూ గమనించారు. కారణం ఏమై ఉంటుందా?అని రాముడు, సీతతో పాటు సభలోని వారందరూ పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టారట.రాముడేమో "రావణుని వద్ద ఏడాది పాటు ఉన్న సీతను తీసికొని ఎంత బాగా ఏలుకుంటున్నాడనుకొని  నవ్వుంటాడా? అని బాధ పడసాగాడట.ఇక సీతమ్మ వారు కూడా ఇంత కాలం రావణ చెరలో ఉన్న  తనను రాముడు ఏలుకోవడం లక్ష్మణునికి ఇష్టం లేనట్టుంది.అందుకే నవ్వాడు కాబోలు అని బాధ పడసాగిందిట. ఇలా మిగతా వారు కూడా రకరకాలుగా ఆలోచిస్తూ లక్ష్మణుడు ఎందుకు నవ్వాడో ఏమో? అయినా ఇంతమంది ఉన్న సభలో అలా నవ్వడం  సభా మర్యాద కాదు కదా!" అనుకోసాగారట.
చివరికి ఉండబట్ట లేక లక్ష్మణుని నవ్వుకు కారణం అడిగితే తెలిసిందేమంటే తాను పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్ర అన్నది లేకుండా ఉన్నాడు.తన నిద్రను భార్య ఊర్మిళకు ఇచ్చాడు.అన్నేళ్ళుగా దూరమైన నిద్ర  నిండు సభలో ఇంత మందిలో ఉండగా ముంచుకు రావడం ఏమిటి? ఆవలింతలు రావడం ఏమిటి? నిద్రాదేవి ఇక నన్ను ఆవహించ బోతోంది కదా! అనుకునే సరికి నవ్వు వచ్చింది.అంతే కానీ వేరే ఉద్దేశం కాదని అసలు విషయం చెప్పాక అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. అంతటి సేవ,భక్తి కలిగిన లక్ష్మణుడు నవ్వునే అపార్ధం చేసుకుని రకరకాలుగా ఊహించారు.అందుకే అలాంటి సమయాల్లో నవ్వకూడదని అర్థం.
అలా నవ్విన వాడు ఖచ్చితంగా  బుద్ధిలేని వాడే అయ్యుండాలి.అందుకే బుద్ధి హీనుని నవ్వు వ్యర్థం అని అంటుంటారు. అదండీ బానకింద చితుకుల మంటకు- బుద్ధి హీనుడి నవ్వుకు సామ్యము.
ఇక రెండవ సామెతను చూద్దాం."పడుచుల/ పడుచువారి కాపురం -చితుకుల మంట" అనేది. ఇదో సరదా సామెత.కొత్తగా పెళ్లయిన జంట మధ్య తరచూ చిరు కలహాలు వస్తుంటాయి. అవి ఎక్కువ సేపు నిలవవు.చిరు కోపాలు అలకలు బుజ్జగింపులతో వెంటనే తీరిపోతాయి. అందుకే "పడుచుల కాపురం - చితుకుల మంట లాంటిది అంటుంటారు. 
 ఇదండీ మన పెద్దలు చెప్పిన"తృణాగ్ని న్యాయము" లోని అసలు అంతరార్థం.
పడుచుల కాపురంలోనే కాదు కుటుంబంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి చితుకుల మంట లాంటి సమస్యలూ, కోపాలు తాపాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని చితుకుల మంటగానే చిరునవ్వుతో స్వీకరించాలి.అప్పుడే  కుటుంబంలో నవ్వుల పువ్వులకూ, ఆనందానికి కొదువ వుండదు. మరి మీరు నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం