చుప్పనాతి శూర్పణఖ;- అచ్యుతుని రాజ్యశ్రీ
  చుప్పనాతి శూర్పణఖ కి గోళ్ళలో  బుద్ధి లో విషం.రాముని పొందాలని అనుకుంది.అందుకే రాముని తో " నీ భార్య అందంగా లేదు.నన్ను పెళ్ళాడు" అని అడిగితే లక్ష్మణుని దగ్గరకు పంపితే ఆయన దాని ముక్కు చెవులు కోస్తే అది బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ రావణుని దగ్గర కెళ్ళి ఎలా రెచ్చగొట్టేలా మాట్లాడిందో చూడండి " నీకు తగిన అందగత్తె ఆసీతని నీ భార్య గా చేసుకో అన్నయ్యా! నీ గూఢచారులు ఏమీ చెప్పలేదు కదూ?" అని అగ్ని లో ఆజ్యం పోసింది.ఒక్క దెబ్బ కు రెండు పిట్టలు ఆమె ప్లాన్.రాముడు తనకు దక్కుతాడు.సీతపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది.సీత వల్లనే తనను రాముడు నిరాకరించాడు అని ఆకుళ్లు బుద్ధి చుప్పనాతి భావం.సీతపై కోరిక పెంచింది..

కామెంట్‌లు