కంచి! అచ్యుతుని రాజ్యశ్రీ
 కంచి పుణ్యక్షేత్రం. కంచి పరమాచార్య నడిచే దైవం. కామాక్షి అమ్మవారి దర్శనం పాపహరం.కంచి పట్టు చీర లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయి.అలాగే సామెత కంచి గరుడసేవ కూడా. గరుడుడు విష్ణుమూర్తి వాహనం.విష్ణు కంచి శివ కంచి అనే రెండు చోట్ల  బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండమైన రీతిలో జరుగుతాయి.
విష్ణు కంచిలో దేవుడువరద రాజేశ్వరస్వామి.ఈయనకు గరుడసేవ  6కి.మీ.ఈరెండు కంచి ప్రాంతాల మధ్య సాగుతుంది. అప్పుడు వేదపారాయణంతో అలా విష్ణుకంచి నుంచి ప్రారంభం శివ కంచి చేరి మళ్ళీ తిరిగి విష్ణు కంచి చేరడం ని కంచి గరుడసేవ అని అంటారు. కానీ ఎందుకు వ్యంగ్యంగా ఆసామెత వాడుతారు అంటే మనం శక్తి కి మించి దాసోహం అని ఊడిగం చేస్తాం వారి మెప్పు కోసం. అలాగే వారు కూడా మనచేత ఒళ్ళు హూనం అయ్యేలా చాకిరీ చేయిస్తారు.తాము ఖుషీ గా ఉంటారు. ఇది తప్పు. మన చాకిరీ తో ఆవ్యక్తి మనచేతిలో కీలుబొమ్మ గా మారాలని ఆశించడం అత్యాశే. అలాగే అడ్డమైన పనులు మనచేత చేయించిన వాడు కూడా  అహంకారం తో ప్రవర్తించడం తప్పు. ఇలా ఆసామెత వెనుక ఉన్న అంతరార్థం  ఇదన్నమాట🌷

కామెంట్‌లు