విద్యార్థులకు రాయడం, చదవడం, చతుర్విధ ప్రక్రియల సాధనకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పఠన, లేఖన నైపుణ్యాల అభివృద్ధికి, గణిత భావనల మెరుగుదలకు మిక్కిలి కృషి చేయాలని ఆయన అన్నారు.
ముందుగా తరగతుల వారీగా, విషయం వారీగా చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి రికార్డు చేయాలని, ప్రతీరోజూ చేపట్టిన పరీక్ష వివరాలను అందులో నమోదు చేయాలని, తల్లిదండ్రుల సమావేశంలో సదరు తర్ఫీదు అంశాలను తెలిపి, వారిలో కూడా మరింత బాధ్యతలను పెంచాలని తిరుమలరావు సూచించారు. రోజూ తప్పనిసరిగా పదినిమిషాలు ఉక్తలేఖనం, ఒరవడి పుస్తకాలను పరీక్షించడం గావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు దార జ్యోతి, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, రబి కుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి