శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
896)సనాత్ -
=========
ఆదియనునది లేకుండినవాడు 
త్రిమూర్తులతో సమమైనవాడు 
శాశ్వతత్వము కలిగినవాడు 
సనాతనుడై విలసిల్లువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
897)సనాతన సమః -

సృష్టికి పూర్వమున్నట్టి వాడు 
బ్రహ్మ సమానుడు అయినట్టివాడు 
విశ్వకర్తగా చరించుచున్నవాడు 
సనాతన సముడయియున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
898)కపిలః -

ఋషులలో ఉన్నతమైనవాడు 
గోరోజనపు వర్ణమున్నవాడు 
అగ్ని స్వరూపము అయినవాడు 
కపిలమహామునియైన వాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
899)కపిః -

సూర్య తేజము గలిగినవాడు 
నారాయణరూపంలోని వాడు 
వానరముఖ్యుడైనట్టి వాడు 
కపి నామము గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
900)అవ్యయః -

ప్రళయమందు లయించుచున్నవాడు 
విశ్రామ స్థానము నిచ్చెడివాడు 
సర్వమూ లీనము చేసుకొనువాడు 
అవ్యయ నామధేయుడైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు