నవ్వుతూ బతకాలిరా !!!!;-సి.హెచ్.ప్రతాప్
 1, మీకు ట్రీట్ మెంట్ పూర్తయ్యింది.టెన్షన్  రాకుండా ఒక ఆర్నెల్లపాటు జాగ్రత్తగా వుండండి.ఫీజు అయిదు వందలివ్వండి” అని అడిగాడు డాక్టర్ దైవాధీనం.
“ సారీ డాక్టర్ ! టెన్షన్ వచ్చే పనులు చెయొద్దని మీరేగా చెప్పారు. దయచేసి ఫీజు అడిగి టెన్షన్ తెప్పించవద్దు” అని వెళ్లిపోయాడు మహేష్.
 
2."అమ్మాయికి, అబ్బాయికీ మధ్య వుండే ఒక తేడా చెప్పు?" కొంటెగా అడిగాడు కిరణ్ తన ప్రేయసి భానుని
 
" అబ్బాయి అమ్మాయిల ముందు ఇంప్రెషన్ కొట్టెయ్యడానికి ఒక రూపాయి వస్తువును రెండు రూపాయలి ఇచ్చి కాలర్ ఎగరేస్తాడు. అదే అమ్మాయి అయితే అబ్బాయి ముందు అదే ఇంప్రేషన్ కొట్టెయ్యడానికి రెండు రూపాయల  వస్తువుకు గంటలకు గంటలు బేరం చేసి ఒక రూపాయికి కొంటుంది" చెప్పింది భాను.
 
3."మళ్ళీ ఎప్పుడు కనిపించమంటేరు డాక్టర్ గారు" అడిగాడు ఆ రోజే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్న కాంతారావు.
 
" ఆర్ధికంగా నిలదొక్కుకున్న తర్వాత కనిపించు. మళ్ళీ టెస్టులు చేసి ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలో చెబుతాను" అలవాటుగా అనేసి నాలిక కొరుక్కున్నాడు డాక్టర్ వెర్రి వెంగళ్ళప్ప
 
4.. "ఎందుకురా సుబ్బా కత్తిని గ్యాస్ మంటలో కాలుస్తున్నావు ?" అడిగాడు పరమేశం.
 
"కత్తితో పొడుచుకొని ఆత్మ హత్య చేసుకుందామని" చెప్పాడు సుబ్బారావు.
 
"అయితే కత్తిని కాల్చడమెందుకు ? ?"
 
"ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు" అసలు సంగతి చెప్పాడు సుబ్బారావు.

కామెంట్‌లు