తిశ్రగతి 6666
-----//-----//----
చేయిపట్టి నడకలన్ని
నేర్పిందీ నాన్నేగా
వెన్నుతట్టి ప్రపంచాన్ని
చూపిందీ నాన్నేగా
మంచినెపుడు మరువరాదు
చెడునెప్పుడు తలవరాదు
మనధైర్యమె మనకురక్ష
తెలిపిందీ నాన్నేగా
ఆకలితో అలమటించు
వారికెపుడు కడుపునింపె
దానముతో జన్మ ధన్యత
పొందిందీ నాన్నేగా
కష్టపడిన వాడెపుడును
విజయాన్నే పొందుతాడు
జీవితాన జ్ఞానమంత
ఇచ్చిందీ నాన్నేగా
పుస్తకాలె నేస్తాలుగ
అక్షరాలె మనకుతోడు
బ్రతుకంతా చదవాలని
చెప్పిందీ నాన్నేగా...
సాహసమే ఊపిరన్న
ధైర్యమేగ తనబాటన
చంద్రఎపుడు నడవాలని
కోరిందీ నాన్నేగా...
---//----//------//--
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి