వర్షం బాగా పడిందా చిన్నా
అయిదేళ్ళ మనవడిని అడిగాను
చాలా పడింది తాతయ్యా
ఒత్తిపలుకుతూ అన్నాడు
అన్నీ తడిసి పోయాయి
అంటూ జత చేసాడు
ఇప్పుడు తగ్గిందా మరి
మళ్ళీ అడిగాను
అవును తగ్గిపోయింది
వెలుతురొ చ్చింది ఎండ కొడుతోంది
మరి నీకేదిష్టం వానా ఎండా
అడిగాన్నేను
‘నాకు...నాకు...
ఆకాశంలో ఏర్పడ్డ
రెయిన్ బో ఇష్టం’ అన్నాడు
అది ఇంద్రధనస్సు లోని
ఇంద్రజాలం మరి
*********************
అయిదేళ్ళ మనవడిని అడిగాను
చాలా పడింది తాతయ్యా
ఒత్తిపలుకుతూ అన్నాడు
అన్నీ తడిసి పోయాయి
అంటూ జత చేసాడు
ఇప్పుడు తగ్గిందా మరి
మళ్ళీ అడిగాను
అవును తగ్గిపోయింది
వెలుతురొ చ్చింది ఎండ కొడుతోంది
మరి నీకేదిష్టం వానా ఎండా
అడిగాన్నేను
‘నాకు...నాకు...
ఆకాశంలో ఏర్పడ్డ
రెయిన్ బో ఇష్టం’ అన్నాడు
అది ఇంద్రధనస్సు లోని
ఇంద్రజాలం మరి
*********************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి