ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ తెల్లవారి ఆకాశవాణి ప్రాంగణంలోకి రాగానే రామ్మోహన్ రావు గారు ఉపశమన వాక్యాలు చెప్పడం నావల్ల తప్పు జరిగింది మరోసారి ఇలా జరగదు అని హామీ ఇస్తూ వేషం చాలా బాగా చేశావు చాలా అందంగా పాత్ర పోషణ చేసేవని ఆనందంతో పొంగిపోయాడు నేను ఏనుగు ఎక్కినంత సంబరపడిపోయాను జరిగింది ఏమిటంటే  ఏ కార్యక్రమానికైనా ప్రతిదాని వివరాలు పేరు తేదీ వివరాలు రాస్తూ ఎవరెవరు ఏ పాత్ర నిర్వహించారు కూడా వ్రాస్తారు దీనికి బందా గారు బాగానే రాసి ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలతో ప్రారంభించి చివరికి రామ్మోహన్ రావు గారు నా పేరు రాశాను అనడంతో రామ్మోహన్ రావు గారి పాత్ర ఉన్నట్టు అర్థం అయింది రామ్మోహన్ రావు గారి పేరు మూడవదిగా వచ్చింది మొదట నాది రెండోది లక్ష్మి ఆ కసితో నా పేరు వదిలేసి చదవడం జరిగింది అని తర్వాత నాకు తెలిసింది.శ్రోతల ఉత్తరాలలో పేరు వస్తుందిలే అని భుజం తట్టాడు రామ్మోహన్ రావు గారు ఆ తెల్లవారి నుంచి 31 వరకు ఉభయకుశలోపరి లో నా పేరు మారుమ్రోగింది రామ్మోహన్ రావు గారి పేరు ఎక్కడ ఎవరు రాసిన దాఖలు లేవు దాంతో రామ్మోహన్ రావు గారు నేను చెప్తే ఒకసారి చెప్పినట్టు అవుతుంది ఇప్పుడు ఎన్ని వందలు దేనికైనా అదృష్టం ఉండాలి నీ పేరు ఎన్నిసార్లు వచ్చిందో చూసావా ఇంతకుముందు ఇలా నండూరి విటల్ గారి పేరు మారు మ్రోగింది ఇప్పుడు ఆయన స్థానంలో నువ్వు వచ్చావు కనుక నేను చెడు చేయాలని అనుకున్నా కానీ నీకు మంచి జరిగింది మంచి భవిష్యత్తు ఉంది నీకు  నాకు వచ్చినంత పేరు కాదు నాకన్నా ఎక్కువ పేరు నీకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అభినందిస్తున్నాను అని అన్నారు ఎంత ఆనందపడ్డాను ఆ మాటల్లో వర్ణించలేను.అమoదానందమంటే ఇదేనేమో ఆనంద్ఏ నా హీరో అని అందరి ముందు బందా ప్రకటించినప్పుడు ఆయన అలా అంటారని నా ఊహ కoద లేదు అన్న మాట ప్రకారం బందాగారు మరణించేంతవరకు నన్ను హీరోగా  శర్మ గారిని ప్రతి నాయకుడిగా చేశారు నండూరి సుబ్బారావు గారు ఎప్పుడు మా ఇద్దరినీ రామలక్ష్మణులు అని పిలిచేవారు అన్నగారు పోయే వరకు ఆయనతో అదే మంచి సంబంధాలు ఉన్నాయి ఒకసారి అనుకోకుండా  వారి ఇంటికి భోజనానికి కూడా వెళ్లాను వదిన గారు నాకు అంత ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు ఆ దంపతుల ఆదరాభిమానాలను అందుకున్నాను ఆ రోజు సమావేశ మందిరంలో అభినందనలు అందించినప్పుడు పొందిన ఆనందం  1992లో ఢిల్లీలో డాక్టర్   నాగులపల్లి భాస్కరరావు ఏడిది గోపాల్ రావు సుప్రీంకోర్టు జడ్జి గారి సమక్షంలో జరిగిన అభినందన సభలో జరిగిన అభినందనలు కూడా అంత ఆనందాన్ని పొందలేదు.
============================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు