ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అది అయిపోయిన తర్వాత  కార్యక్రమం ఏమిటో  ముందే  సిద్ధమై ఉండాలి  క్లోజింగ్ అనౌన్స్మెంట్ అయిపోగానే రెండో దాన్ని ఓపెనింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చి వెంటనే టేప్ ని గాని రికార్డును కానీ  ప్రారంభించాలి  ఈ మధ్య రెండు మూడు సెకనులు కన్నా ఎక్కువ వ్యవధి ఉండడానికి వీలులేదు  ఎక్కువ ఉంటే శ్రోతకు తెలిసిపోతుంది  అలా ఎంతో జాగ్రత్తతో కార్యక్రమాలు   నడపాలి  మధ్యలో  ఇంగ్లీష్ హిందీ వార్తలు ఢిల్లీ నుంచి వస్తాయి  వాటిని తెలియచేస్తూ వుండాలి. ఒక్కొక్కసారి మన కార్యక్రమం పూర్తయిన తర్వాత మరో కేంద్రం గురించి కార్యక్రమాన్ని మనo రిలే చేసుకోవచ్చు  దానికి సాంకేతిక నిపుణులకు  మనం సహకరించాలి  కాలాన్ని తప్పకుండా సెకండ్లతో పాటు  జాగ్రత్తగా ఉండాలి.ఒక్కొక్కరు కార్యక్రమానికి వచ్చేటప్పుడు అరగంట నాటకానికి గంటకు సరిపడా రాసి తీసుకొస్తారు  అక్కడ నాకు మా ప్రసాద్ ఉపయోగపడతాడు  తమ్ముడు అరగంటకు వచ్చేయ్ అని చెప్పి మేము కాఫీ తాగి వచ్చేసరికి కంటి కంటిన్యూటి చేడకుండా  అందంగా ఎడిట్ చేసేవాడు  చాలా నాటికలకు సహాయపడ్డాడు తను రికార్డింగ్ కు వచ్చినప్పుడు  ఆయనతో ప్రతి రాత్రి మా మోహన్ తో గడపవలసిందే ప్రసాద్కు  మోహన్  పరిషత్తులు నడిపించడంలో కరుడైనవాడు ప్రసాద్ విజయవాడలో మేము నడిపిన పరిషత్తుకు  శ్రీ కలిపి శ్రీ కళాంజలి పేరుతో నడిపాడు దానికి నాకు సన్నిహితుడైన తుర్లపాటి బాబ్జి గుంటూరు శాస్త్రి  అలుదు నుంచి వరుదు రంగారావు అప్పుడే విశాఖపట్నం  కేంద్రానికి కొత్తగా వచ్చిన  ఈ ఆర్ డి రాముడు అందరినీ కలిపి ఎంపిక చేసుకొని లోకల్ గా ఒకరిని ఎంచుకొని నడిపే వాళ్ళం.
మా యూనిట్ మొత్తానికి డాడీ ముఖ్యం ఆర్థిక శాఖ ఆయనే కాలేజీలో మాస్టారు  మంచి సలహాలు ఇస్తారు అతని పేరు సూర్యనారాయణ  పర్లాకిమిడి ఒరిస్సాలో తెలుగు ప్రావీణ్యం చూపిన వారిని కలిసి వాళ్లతో కూడా రికార్డింగ్ చేయడానికి ప్రసాద్ సాయపడేవాడు సివి గారు ప్రతిపాదిస్తూ ఉండేవారు  అలా నాలుగు జిల్లాల వారికి చిరపరిచితుడిని అయ్యాను ఇంతమందిని నాటకాలు లో నటింప చేస్తున్నారు మీరు స్టాప్ ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని సివి గారిని అడిగితే అదే మాట ఏవి రామారావు కామాక్షమ్మ శేషారత్నం అంత సహకరిస్తున్నారు కదా అన్నారు  వాళ్లు సరే మన మధుని ఎందుకు వాడుకోవడం లేదు అన్నాను ఆయనకు చేయాలని లేదని సమాధానం.-
==============================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు