ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నెమలి కంటి తారక రామారావు గారు రచించిన కురుక్షేత్రం నిజానికి  చావగలిగిన నాటకం  ఇందులో పద్యాలు లేకపోయినా పౌరాణిక పద్ధతికి ఇబ్బంది కలగకుండా రచన   సాగింది హైదరాబాదులో కూడా  రాష్ట్ర ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రశంసించారు  నాటకం చూసిన తర్వాత  బుచ్చమ్మ చచ్చిపోయింది ఎమర్జెన్సీ టైములో ఈ స్వాతంత్రం మనకొద్దు కావడి వాళ్ళ లాంటి శరత్ రాసిన నాటకాలను రంగస్థలంపై ప్రదర్శించి రేడియోలోనూ  శ్రోతలను ఆకట్టుకునే విధంగా నిర్వహించాడు  రంగారెడ్డి రచించిన కృష్ణపక్షం నాటికను గన్నవరం తన సొంత సంస్థలో ప్రదర్శించడం ఆకాశవాణికి సంబంధించిన ఏ లింగరాజు శర్మ రెండు చింతల రామచంద్రరావు రాజకుమారి విజయలక్ష్మి వాళ్ళతో ప్రదర్శించి కొన్ని పరిషత్తుల బహుమతులు కూడా పొందాడు.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను తానే నిర్వహించేవాడు  ముఖ్యమంత్రులుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇలాగే నాదెండ్ల భాస్కరరావు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు గారి హయాంలో ఈయన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాడు.ఏ మాత్రం రంగస్థలం పరిచయం లేని వారిని కూడా రాణించేలా ప్రదర్శనలు ఇప్పించారు నన్నపనేని రాజకుమారితో సంగీత కార్యక్రమాన్ని స్పీకర్ ప్రతిభా భారతి గారితో లంబాడి యువతి వేషాన్ని కుతూహలమ్మ గారితో పూసలమ్మ కామెడీ పాట గీతారెడ్డి గారితో గౌతమ బుద్ధుడు ఈపూరి సీతారామమ్మ గారితో శబరివేషం మండవ వెంకటేశ్వర రావు గారితో శ్రీరాముడు  వేషాలను వేయించి రవీంద్ర భారతిలో తాను యువ దుర్యోధన పాత్రధారిగా అందరి ప్రశంసలను పొందాడు జూపూడి యజ్ఞనారాయణ గారితో ఓల్డ్ దుర్యోధన వేయించి తాను దుర్యోధనుడిగా నటించి ప్రఖ్యాత రంగస్థల నటుడు దర్శకుడు ఈ మధ్యనే ప్రకాశం పంతులు గారి పాత్రలో జీవించిన చాట్ల శ్రీరాములు గారితో మరో మొహంజదారో నాటికలను ప్రదర్శించాడు.
=============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు