ఏ సాహితీ సభ చూసిన ఏముంది గర్వకారణం;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
ఏసాహితీ సభచూసిన
ఏముంది గర్వకారణం
కొంత వంతు డబ్బా
అంతా సొంత డబ్బా

పుస్తక సమీక్ష చేయమంటే
అవుటాఫ్ కంటెంట్
మాట్లాడే
సెల్ఫ్ డబ్బా
వక్తలు

ముఖస్తుతి కి
ముఖం వాచిపోయినోళ్ళు

విమర్శ చెవిలో చెప్పు
ప్రశంస పదిమందిలో చెప్పాలన్న
కనీససోయిలేని
సోకాల్డ్ మేధావులు 

వీరే
సర్వం తెలిసినవారమనే
 అహం చూపే
అపరబ్రహ్మలైన
కవులు

విశ్వశ్రేయం కావ్యం
అన్న
కనీస జ్ఞానం లేని కవుల
జీడిపాకపు 
మిక్చర్ పొట్లపు
కవితలకే 
ఆహా !
ఓహో!!
భళీ! భళీ!
అని బాకా ఊదేటోళ్ళు
పెయిడ్ ఆడియన్స్ లా
(కు)కవి పుంగవులు 

ఈ కవితా గోష్ఠులదారెటో
కవులకవనాలు
కడుపేదల కడుపాకలితీర్చేవైఉండాలి
కానీ
బలిసినోడిని జోకొట్టేలా ఉండకూడదు

అనునిత్యం 
కవితా కార్యశాలలు
సాహిత్య సంఘబాధ్యులు
నిర్వహించి 
నిఖార్సైన
నిజాన్ని
ఇజాన్ని
ఎలుగెత్తి చాటే
కవితలు వ్రాయించాలి
సామాజిక ప్రయోజనాత్మకమైన
రచనలతో 
సాహిత్య సభలు జరిగి
పుస్తక ఆవిష్కరణలు చేస్తే
ఆ సభలు ,ఆసంకలనాలు
సామాజిక చైతన్యానికి
 సాంస్కృతిక పునరుజ్జీవనకు
ఊపిరులూదుతాయి
============================
ఇకనైనా 
కవులుఅంటే ప్రజలెన్నుకొనని ప్రజాప్రతినిధులు
అన్న సూక్తిని నిజం చేద్దాంకామెంట్‌లు