చీకటి నుండి వెలుగులోకి---;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
చీకటి నుండి వెలుగులోకి 
అజ్ఞానాంధకారంనుండి
జ్ఞానోదయానికి
 ఓస్త్రీ మూర్తి
ఇంటికి దీపమే నువ్వూ
ఇంటికోసమై
అనునిత్యం శ్రమిస్తూనే ఉంటావు

అణుకువ గా ఉంటావు
రాక్షససహనం నీదమ్మా
పరమసాధ్వీనువ్వేనువ్వే
పావనగంగవునువ్వేనువ్వే

నీఇంటి దీపశిఖవునువ్వే
బిడ్డల పాలిట తొలి దైవం నువ్వే
అక్షర లక్షల నొసగే తొలి గురువు నువ్వే 
ఏబిడ్డకైన అమ్మ అడుగుజాడ తమకు (వారికి)వెలుగు మేడే కదా!?

అన్యాయం అణచివేత ఉన్న చోట శివంగై లేస్తావు.
 కర్తవ్యబోధచేస్తావు

దేశ్ ముఖ్ లను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మవవుతావు

కర్తవ్యం మరచి సారాయికి బానిసై కుటుంబాన్ని నట్టేట ముంచిన తాగుబోతులను
బాగుపరచడానికి సారా వ్యతిరేక పోరాటం చేసిన దూబగుంట రోశవ్వవుతావు

అమాయకులైన ఆడవారికి అండగా ఆడవారే ఐపీఎస్ అధికారి అయితే న్యాయం జరిగేలా చూడొచ్చని అకుంఠిత దీక్షతో చదివి ఎదిగిన
తొలి ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ వవుతావు

అంతరిక్ష రహస్యాలు చేధించడానికై ప్రాణాలను పణంగా పెట్టి అంతరిక్షాన్ని చుట్టొచ్చిన అమర పైలట్ సాహసవంతురాళ్ళు కల్పనా చావ్లా ,సునీతా విలియమ్స్ వవుతావు

 ఆడదంటే‌ అమ్మే 
ఆడదంటేఆదిపరాశక్తే
సకల చరాచర సృష్టికి మూలవేరే ఆడది

ఆడవారే ఇంటివేల్పులు
మహిళలు మహారాణులు
వీరుతమస్సు నుండి ఉషస్సునకు
అచేనత్వంనుండి చేతనత్వానికి
పయనిస్తూ 
లోకాన్ని నడుపుతూ
సకలమానవాళికి దిక్సూచిగా
నిలుస్తారు
నిత్యం ఆరిపోని అఖండ జ్యోతులై వెలుగులు పంచుతారు

కామెంట్‌లు