స్నేహబంధమే అజరామరమైనది;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
ఎంత ధనం పోగేస్తావు 
నువ్వు వల్లకాటీ కెళ్ళేలోపు

ఎంత ధనం పోగేస్తావు
నువ్వు కడుపుమాడ్చుకొని
పిసినారి వాని వలే

శారీరక సుఖం లేక?!
నిద్రా సుఖమసలే లేకా?!
పని రాక్షసుడవై నువ్వు 

తోటివారి పనిని
నువ్వేచేసి, ఇతరుల ఆవేశకావేశకాలకు
కారణమే నువ్వై

శారీరక బడలికతో
రోగగ్రస్థుడవైతే?!

నీకష్టంతో సుఖాన్ననుభవించే?!
నీ భార్య బిడ్డలు
నీకు సపర్యలు చేయడానికే
వెనకముందాడితే!?

ఇందుకానేను
పగలు రాత్రి అనే తేడా లేకుండా?
పనిపాటచేసింది
నావాళ్ళనుకున్నవాళ్ళకు
నేనుపరాయి వాన్నై!?

సవతిప్రేమచూపితే
నా సంపద కోరుకునే
వాళ్ళకంటే

నా సంక్షేమంకోరుకునే
నా మిత్రులకోసమై
వెతికినా!?
నాకళ్ళలోని
ఆర్తి ని చూసి
బాధల్లో ఓదార్పును
అందించే
ఒక్కస్నేహితుడుంటే
చాలని
స్వార్థపరులైన
వ్యక్తులను దూరం పెట్టడం నేర్చుకున్నా!?

వస్తుప్రేమలకు దగ్గరయ్యే
భార్యాబిడ్డలకన్నా
ఎటువంటి
 రక్తసంబంధంలేని
స్నేహబంధమే
అజరామరమైనదని
తలంచా!?

కామెంట్‌లు