మనుషులను ప్రేమించు
మనిని కాదు
అన్ని వస్తువులు
అమ్మకం అవుతున్నాయంటే
మనిషి అంగడిసరుకైనట్టేగా!?
ఈ వ్యవస్థను పెట్టుబడిదారీ
వ్యవస్థ అని అంటారు
దీనికి దయా జాలి కరుణ
ఏ కోశాన ఉండదు
దోపిడీ చేయడమే
దాని( దీని)మూలసూత్రం
అహం మనిషిని పతనావస్థకు తీసుకెళ్ళేఉద్వేగమది
విచక్షణను మరచి ధనమదముతో
పేట్రేగిపోయే స్వార్థపరుల ఏకైక
ఆయుధమది
యుగయుగాలుగా పేదవాణ్ణి
ధనికులు
దొరలు
బలహీనులను బానిసలు గా
చేసుకొని పైచేయి సాధించినవారే!?
ఎదురు తిరిగితే మరణమో!?
తీవ్రవాదమో !?అంటగట్టి
చిత్రహింసలకు గురిచేసిన
పైశాచికత్వం!?
నిన్ను వలె నీ పొరుగు వాడిని
ప్రేమించుము
బ్రతుకు బ్రతక నివ్వు
ఈర్ష్య అసూయలు మనిషిలో
ఉండే మానసిక రోగలక్షణాలు
పిల్లలు తో ప్రేమగా
పెద్దల పట్ల గౌరవంగా
నిరుపేదల యెడ దయామయుడు గా
వృద్దుల యెడ ఆదరణతో
ఉందాం
మనిషిగా జన్మించడం
మన పూర్వజన్మ సుకృతం గా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి