న్యాయాలు-551
దధి వ్రీహి న్యాయము
******
దధి అంటే పెరుగు. వ్రీహి అంటే వడ్లు. వీటినే శాలి ధాన్యము అని అంటారు. అయితే ఈ వడ్లు రెండు ఋతువులలో పండుతాయి. హేమంత ఋతువులో పండించే ధాన్యాన్నే హైమంతిక ధాన్యం అంటారు.ఇక వర్ష ఋతువులో పండించే ధాన్యాన్ని వ్రీహి ధాన్యం అంటారు.
మన పూర్వీకులు రైతులై తాము పండించే ధాన్యం లేదా వడ్లలో ఏవేవీ ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో చెప్పడం వారి నిశితమైన దృష్టికి తార్కాణం.
మరి వ్రీహి ధాన్యము గురించి కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
ఈ వ్రీహి ధాన్యములో తిరిగి కృష్ణ వ్రీహి ధాన్యము,కుక్కు తాండకములు,శాలా ముఖములు,జంతు ముఖములు అనే రకాలు వున్నాయని ధాన్యం పండించే రైతులు చెబుతుంటారు.
ఈ వ్రీహి ధాన్యము వండితే తియ్యగా ఉంటుంది.చలువతో పాటు కొద్దిగా మలబద్ధకం కలుగ జేస్తుందని ఆయుర్వేద వైద్యులు పరిశోధనలో తేలింది.
అలాగే వ్రీహి ధాన్యములలో కృష్ణ వ్రీహి ధాన్యము మిక్కిలి శ్రేష్టమైన దనీ, అన్నము తియ్యగా, తెల్లగా వుండటంతో పాటు పిత్తాన్ని హరిస్తుంది.అంతే కాకుండా వీర్య వృద్ధి కలుగజేస్తుంది.క్రిమిరోగాలు,కఫ సంబంధ వ్యాధుల్ని పోగొట్టి బుద్ధి సూక్ష్మత కలిగిస్తుంది.
ఈ వ్రీహి ధాన్యములలో ఆరు నెలలకు పండే షష్టికములు , మహా వ్రీహి ధాన్యము, రక్త సార ముఖములు అనే రకాలు కూడా ఉన్నాయి.
వ్రీహి ధాన్యము గురించి కొన్ని విషయాలు విశేషాలూ మనం తెలుసుకున్నాం కదా!
మరి ఈ వ్రీహి అన్నాన్ని దధితో/ పెరుగుతో కలిపి దధి వ్రీహి అని ఎందుకు అన్నారో చూద్దామా...
"పెద్దల మాట చద్దన్నం మూట"అన్న నానుడి ఎంత గొప్పదో అందులో ఎంత గొప్ప అంతరార్థం వుందో మనందరికీ తెలిసిందే.
మరి చద్దన్నం అంటే ముందు రోజు రాత్రి మిగిలిపోయిన అన్నం అన్నమాట.దానిలో కాసింత పెరుగు లేదా మజ్జిగ కలిపి వుంచుకొని మరుసటి రోజు పరగడుపునే తింటారు.అలా తినే అన్నాన్నే చద్దన్నం అంటారు.
ఈ విధంగా వ్రీహి ధాన్యముతో వండిన అన్నాన్ని పెరుగుతో రాత్రి కలిపి ఉదయాన్నే తినడం.ఈ పెరుగన్నం ఎంతో ఆరోగ్యకరమైన భోజనమని ఆహార నిపుణులు చెబుతున్నారు.జీర్ణ వ్యవస్థకు, ప్రేగుల ఆరోగ్యానికి చాలా ఈ అన్నం చాలా మంచిది. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు పెరుగన్నం తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది.పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.
పెరుగులో ఉన్న కాల్షియం ఎముకలు దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.ఇందులోని ప్రొటీన్లు ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తాయి.
మరి "పెద్దల మాట చద్దన్నం మూట లేదా పెరుగన్నం మూట " అని ఎందుకు అన్నారో ఈ పాటికి ఎప్పుడో అర్థమై పోయింది కదా!చద్దన్నంలో లేదా పెరుగన్నంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో పెద్దల మాటల్లో కూడా నైతిక విలువల పోషకాలు ఉన్నాయి. వారు చెప్పే ప్రతి మాట జీవిత అనుభవంలోంచి వచ్చిందే. అలాంటి మాటలను తు.చ తప్పకుండా వింటే, పాటిస్తే ఆదర్శవంతమైన జీవితం మన సొంతం అవుతుంది.
ఈ "దధి వ్రీహి న్యాయము" చెప్పేది కూడా ఇదే. మన పూర్వీకులు ఇలాంటి ఆహారం నిత్యం తీసుకునే వారు కాబట్టే వారెంతో ఆరోగ్యంగా వుండేవారు. మనం కూడా దీనిని చక్కగా ఆచరిద్దాం.ఆరోగ్యంగా ఆనందంగా వుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి