అరుదైన రూపం!అరుదైన శిల్పం!!;- - జయా
 పరమశివుని కంఠంలో హాలాహల విషాన్ని ఆపుతున్న పార్వతీదేవి! 
శివుడు తాగిన విషాన్ని కంఠంలో నిలిపిన పార్వతీ దేవి... అరుదైన శిల్పం!!
విషం కిందకు దిగకుండా ఆపడానికి పార్వతి శివుని కంఠాన్ని పట్టుకుంది.  
ఈ అరుదైన శిల్పం కర్ణాటకలోని నంజన్‌గూడులో గల శ్రీకంఠేశ్వర స్వామి ఆలయంలో దర్శించవచ్చు.
హాలాహలం లేదా కాలకూటం అనేది హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసినపుడు వెలికివచ్చిన విషం. ఇది అమృతం ఉద్భవించక మునుపే పుట్టింది. దీనిని చూసి దేవతలు, రాక్షసులు భయకంపితులయ్యారు. అయితే దానిని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో బంధించాడు. అందుకనే ఆయనకు నీలకంఠుడనే పేరు వచ్చింది.

కామెంట్‌లు