రచ్చల్లో బుచ్చయ్య ;- ఎడ్ల లక్ష్మి
రథం నీవు ఎక్కలేవు 
రచ్చబండ చేరలేవు 
రచ్చోళ్ళ బుచ్చయ్య
రచ్చ రచ్చ చేయబోకు !!

వచ్చిరాని మాటలతో
చిచ్చు నీవు పెట్టబోకు 
రచ్చోళ్ళ బుచ్చయ్య 
కచ్చె మాటలనబోకు !!

నిచ్చలంగా ఉండయ్య 
ఖచ్చితమైన పనులతో
రచ్చోళ్ళ బుచ్చయ్య 
స్వచ్ఛంగా నీవు బ్రతుకు !!

మెచ్చుకున్న ఒకటే నయ్య 
మెచ్చుకోకున్న ఒకటేనయ్య
రచ్చోళ్ళ బుచ్చయ్య 
విచ్చుకపోకు నీవయ్య !!


కామెంట్‌లు