ఆసియా ఖండము నుండి భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు సర్ చంద్రశేఖర వెంకట రామన్. 1928లో భౌతిక శాస్త్రములో “రామన్ ఎఫెక్ట్” అనే అంశాన్ని కనుగొని ప్రపంచానికి తెలియజేసి 1930లో ఆ అంశానికి నోబెల్ బహుమతి పొంది భారతీయులు గర్వపడేలా చేసిన వ్యక్తి రామన్. సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సీవీ రామన్). వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్‌ను శక్తివంతంగా చూపి, అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్.
వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్ అందుకున్న కాంతి పుంజం. ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఈయన నవంబర్ 7, 1888లో మద్రాసు రాష్ట్రములోని తిరుచిరాపల్లి లో చంద్రశేఖర అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు.విశాఖపట్నము సెయింట్ అలోయిసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ లో 11ఏళ్ల కే మెట్రిక్యులేషన్ పాస్ అయి 13 ఏళ్లకే ఎఫ్ యే (ప్రస్తుత ఇంటర్ తో సమానమైన పరీక్ష) పరీక్ష పాస్ అయి స్కాలర్ షిప్ పొందాడు. ఆ విధాంగా పువ్వు పుట్టగానే పరిమళించునట్లు చిన్నతనం నుండే జ్ఞాన సముపార్జన పట్ల విపరీతమైన ఆసక్తి తో విద్యాభ్యాసంలో ఎప్పుడూ ప్రధముడిగా నిలిచాడు. అతను 1902లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రవేశించాడు మరియు 1904లో తన భ్బి యే పరీక్షలో ఉత్తీర్ణుడై, భౌతిక శాస్త్రంలో ప్రథమ స్థానం మరియు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 1907లో అతను తన ఎం యే డిగ్రీని పొందడమే కాక మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రధముడిగా నిలిచాడు.ఆ సమయంలోనే పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధనలకు అనుమతిని పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధనలు నిరంతరం కొనసాగాయి.సముద్రం నీరు నీలి రంగులో ఎందుకుంటుంది? ఈ అంశంపై సీ. వి. రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచింది. ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాలే ఆయనను నోబెల్ చెంతన నిలబెట్టాయి.అణువులోని ప్రోటాన్, కేంద్రకాల ను కనుగొన్న రూథర్ ఫర్డ్ అనే శాస్త్రవేత్త రాయల్ సొసైటీలో తన అధ్యక్ష ప్రసంగము లో రామన్ స్పెక్ట్రోస్కోపీ ప్రయోగాన్ని మెచ్చుకుంటూ ఉటంకించాడు, ఫలితముగా రాయల్ సొసైటీ వారు అయన కృషిని మెచ్చుకొని ఆయనను సర్ బిరుదు తో సత్కరించారు అప్పటినుండి సర్ సివి రామన్ గా పిలవబడ్డాడు.భారత ప్రభుత్వం కూడా ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించి.. 1954 లో 'భార తరత్న' బిరుదు ఇచ్చింది. 1957 లో సోవియట్ యూనియన్ 'లెనిన్ బహుమతి'తో సత్కరించింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి