సుప్రభాత కవిత ; -బృంద
చేయితిరిగిన చిత్రకారుని 
చేతిలోని కుంచె విదిలించిన
సప్తవర్ణ సమ్మిళిత అద్భుత
సమ్మోహన వర్ణశోభిత చిత్రం

ఇలకు దిగిన ఇంద్రచాపము
వలపుసందేశము చేతబట్టి
అపురూప సంగమ తరుణాన
భువికి దివి ఇచ్చిన కానుకనిచ్చే...

అపురూప సమయాన
అనురాగ మాలికలతో
ఆహ్వానించిన పుడమికి
అణువణువూ సంభ్రమమే!

ఎదురుచూపుల వెతలు దాటి
బెదురుచూపుల సిగ్గు తోటి
కుదురులేని తలపులు దాటి
అదురు తగ్గి అపేక్ష  చాటిన...

అద్భుత మనోహర దృశ్యపు
రమణీయతను చూసిన కడలి
ఆగలేక తనలో దాచేసుకుని
మరిమరీ  చూసి మురిసెనేమో!

కొత్త వెలుగుల పండుగ తెచ్చే
నిత్యకల్యాణ కాంతులధార
సత్యమై శివమై సుందరమై
ముత్యమల్లే మనసును మురిపించే

ముచ్చటైన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు