సెల్ ఫోన్ అతి వాడకం అనర్ధదాయకం ;-సి.హెచ్.ప్రతాప్
 మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది . ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణము గా ఈరోజు మారాయి. సెల్ ఫోన్లు మానవ శరీరానికి రోగాలని కలగచేసే లేదా మన ఆరోగ్యానికి హాని కలగచేసే సూక్ష్మ తరంగాలని ప్రసరిస్తాయి మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు.  మొబైల్ ఫోన్ అతి వాడకం అనేక ఇతర పరోక్ష ఆరోగ్య ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ఉదాహరణకి:
ఎలక్ట్రానిక్ పరికరాలు - పరికరాలు ఫీల్డ్‌కు హాని కలిగితే వైద్య ఎలక్ట్రానిక్ పరికరాలతో ఆర్ ఎఫ్  రేడియేషన్ జోక్యం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆసుపత్రి భవనాల్లో హ్యాండ్‌సెట్‌లను ఆఫ్ చేయాలి.
రోడ్డు ప్రమాదాలు - డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో పట్టుకున్న మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం పలు విదేశాలలో నిషిద్ధం.
అధిక స్మార్ట్‌ఫోన్ వాడకం సాయంత్రం వరకు మిమ్మల్ని మానసికంగా నిమగ్నమవ్వడమే కాకుండా, స్క్రీన్ నుండి వచ్చే "నీలం" కాంతి వాస్తవానికి మీ నిద్రపోయే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది మరియు మీ నిద్రలేమి అవకాశాలను పెంచుతుంది . టెండినిటిస్. ఎక్కువ టైపింగ్ చేయడం వల్ల మీ బొటనవేళ్లలో స్నాయువులు ఎర్రబడినవి మరియు పుండ్లు పడవచ్చు.
సెల్ ఫోన్ లు బాగా వాడే యువకుల రోజువారీ ప్రవర్తనను పరిశీలించిన ఒక అంతర్జాతీయ అధ్యయన బృందం వారు తీవ్రమైన మానసిక వత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తెల్సింది. సెల్ ఫోన్ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు వత్తిడికి గురవ్వడంతో పాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్లుగా కూడా వెల్లడైంది. సెల్ ఫోన్ లతో పాటు మ్యూజిక్ సిస్టమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ బృందం వెల్లడించింది.
మొబైల్‌ ఫోన్‌లలో ఎక్కువ సమయం సంభాసించే వారికి బ్రెయిన్‌ కాన్సర్‌ వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వినియోగదారులకు ఓ హెచ్చరిక చేసింది. 15 నిమిషాల పాటు ఏకధాటిగా మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే తప్పనిసరిగా బ్రెయిన్‌ కాన్సర్‌ వస్తుందని, తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. దాదాపు 13 దేశాలలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులపై పరిశోధనలు నిర్వహించగా, ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసిందని తెలిపింది. ఓ రోజులో 15 నిమిషాలు మొబైల్‌ ఫోన్‌లో సంభాషణలు జరిపినా బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశా లున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 

కామెంట్‌లు