అర్థం!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
మనిషి ఇప్పుడు 
ప్రక్కవాణ్ణి అంగీకరించడం లేదు 
తోటి వారినే నమ్మడం లేదు 
ఇక దేవునేమ్మీ నమ్ముతాడు!!!

తానే దేవున్నీ అవుతానంటాడు 
దేవున్నీ పక్కన పెట్టి 
తననే దేవుడిని చేయమంటాడు!!!!!?

మన అదృష్టం కొద్దీ 

ఏ నాయకుడు దేవుడవలేదు 
ఏ విజ్ఞాన వేత్త దేవుడు అవ్వలేదు 
ఏ వ్యాపారవేత్త దేవుడు అవ్వలేదు 
ఏ ధనవంతుడు దేవుడవలేదు. 

మహా అయితే 
వీరంతా సొంత పేరు మిగిల్చుకున్నారు అంతే.!!!?

నిజానికి 
మన జీవితానికి ఒక అర్థం దొరికిన తర్వాత 
మన జీవితం మనకర్ధమైన తర్వాత 

ఎవరెంత అసభ్యంగా ప్రవర్తించిన 
ఎవరెంత అసభ్యంగా మాట్లాడిన 

వాటికి అర్థం లేదు 
మన జీవితంలో వారికి సభ్యత్వం లేదు.!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు