క్రాప్ సర్కిల్స్ ! అచ్యుతుని రాజ్యశ్రీ

 దక్షిణ ఇంగ్లాండ్ లో 1980తర్వాత  పొలాల్లో ఓవింత గమత్తు జరగటం ఆశ్చర్యం. కేవలం ఒకేఒక్క రాత్రి కల్లాపొలం చుట్టూ వలయాలు గీయబడి ఉండటం.పైరు వాలిపోయి వింత డిజైన్లు ఏర్పడటం ఇంకో విశేషం. ఒక యంత్రం తో పొలం చుట్టూ చదునుగా చేసి నట్లుగా కనపడటం ఓవింత.    పైరు మొక్కల కాడలువంగి వాలిపోయినా అవిచావవు.ఎలాంటి నష్టం పంటకు కల్గదు.   ఇలా క్రాప్ సర్కిల్ ఏర్పడడానికి కారణం ప్రకృతి శక్తి భూమికదలిక అని.ఇంకొంత మంది మాత్రం గ్రహాంతరవాసులపని అన్నారు. ప్రతి ఏడాది ఇంగ్లాండ్ లో సాలిస్బరీ ప్రాంతంలో ఇలా పొలాలచుట్టూ గీతలు రకరకాల ఆకారాల్లో తెల్లారితే చాలు కనపడటం సర్వసాధారణం ఐంది. టూరిస్టులను ఆకర్షించటానికే అక్కడి వారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఇంకొందరి కథనం🌹
కామెంట్‌లు