ఇది ఎవరు రాశారో ఎక్కడ చదివానో గుర్తుకు రావడం లేదు. కానీ చదవడంతోనే నన్ను కట్టిపడేసింది. మనసుని హత్తుకుంది. ఈ మాటల్ని ప్రేమిస్తున్నాను అమితంగా.
పిల్లల కోసం ఎదురుచూడడమే తల్లి విధిరాత.
పిల్లలు ఏదైనా పని మీద వెళ్తే వారి కోసం వేచి ఉంటుంది అమ్మ.
పిల్లలు పాఠశాల నుండి బయటకు వచ్చినప్పుడు వారి కోసం వేచి ఉంటుంది.
పిల్లలు తమ స్వంత జీవితాన్ని ప్రారంభించినప్పుడూ వారి కోసం వేచి ఉంటుంది అమ్మ.
పిల్లలు ఎటు వెళ్ళినా వారి కోసం ప్రేమతో, ఆందోళనతో కొన్నిసార్లు కోపంతో వేచి చూస్తుంది ఇంకా రాలేదేమిటాని....
పిల్లలు రావడంతోనే అమ్మకెంత ఆనందమో
కానీ పిల్లలు ఏమీ జరగనట్లు ఏమీ తెలియనట్లు ఇంట్లోకి వెళ్లిపోతారు. ఒక్కొక్కప్పుడైతే విసుక్కుంటారు కూడా...ఎందుకమ్మా అలా నిరీక్షిస్తావని. కానీ మీ రాకకోసం నిరీక్షించే తల్లిని ఒక్క క్షణం కౌగిలించుకుని చూడండి...ఆ మనసెంత హాయిగా ఆనందిస్తుందో...మీ మనసుకు తెలుస్తుంది.
పిల్లలు పెరిగి పెద్దవారై ఎక్కడో జీవితాన్ని గడపవలసి వచ్చినప్పుడు ఓ నిర్ణయం తీసుకోండి. అమ్మను ఇక నిరీక్షణకు అప్పగించక మనమే వెళ్ళి చూడాలని. అమ్మను ప్రేమించాలి.
మిమ్మల్ని అంతకాలమూ ప్రేమించిన వ్యక్తిని మరెవరూ చేయని విధంగా కౌగిలించుకోండి.
ఎందుకంటే అమ్మ వృద్ధాప్యంలో ఉండొచ్చు. కానీ అమ్మ హృదయం ఎప్పుడూ నూతనమే. నిత్యనూతనమే.
మీ తల్లిలా మిమ్మల్ని ఇంకెవరూ ప్రేమించరు. ప్రేమించలేరు.
కనుక
అమ్మ నిరీక్షణ సామాన్యం కాదని గ్రహించండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి