చివరి పేజీ;- - జగదీశ్ యామిజాల

జీవితం
ఓ పుస్తకం లాంటిది.

ప్రతి పుస్తకానికీ
ఓ ముగింపు 
ఉంటుంది.

అది మనకు 
ఎంత ఇష్టమో
కాదో అప్రస్తుతం...
తప్పనిసరిగా 
ఆ పుస్తకానికి 
చివరి పేజీ ఉంటుంది

చివరి పేజీ లేని 
ఏ పుస్తకమూ 
పరిపూర్ణం కాలేదు

పుస్తకంలోని
చివరిపేజీలోని 
ఆఖరు మాటలు 
చదివినప్పుడే
పుస్తకానికి
మనం నచ్చుతాం

అంతేకాదు, 
మనకూ 
ఆ పుస్తకం
ఎంత మంచిదో
తెలిసొస్తుంది

కామెంట్‌లు