న్యాయాలు-557
దివాంధ న్యాయము
****
దివా అనగా పగటిపూట.అంధ అనగా గుడ్డి, చీకటి అనే అర్థాలు ఉన్నాయి
అందరికీ ఇష్టమైన పగటిపూట గుడ్లగూబకు మాత్రం అయిష్టం అని అర్థము.
గుడ్లగూబలకు పగటి పూట అంటే ఎందుకు ఇష్టం ఉండదో చూద్దాం.
గుడ్లగూబ పెద్ద పెద్ద కనుగుడ్లతో చూడటానికి భయపడేలా, వికారంగా ఉంటుంది.ఇది మనుషులకు ఎలాంటి హానీ చేయకున్నా చాలామందికి నచ్చదు. కొందరు దీనిని అపశకున పక్షిగా భావిస్తారు. మరికొందరు లక్ష్మీదేవి వాహనంగా శుభ సూచకంగా పరిగణిస్తారు.
దీనిని రాత్రి పక్షి అంటారు.రాత్రిపూట మాత్రమే చురుకుగా చూడగలదు.దీని కళ్ళు ఇతర పక్షులకు భిన్నంగా మనుషుల కళ్ళవలె ముందుకు వుంటాయి కానీ మనుషుల్లా కళ్ళను అటూ ఇటూ కదిలించలేవు. అయితే తలను మాత్రం 270 డిగ్రీల వరకు అంటే పూర్తిగా గుండ్రంగా తిప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.అందువల్లే రాత్రి పూట జంతువులను వేటాడే సమయంలో తల గుండ్రంగా తిప్పి చూస్తూ చాకచక్యంగా వేటాడుతుంది. గుడ్లగూబ కంటి రెటీనాలో తక్కువ శంకువులు మరియు ఎక్కువ రాడ్ లు కలిగి ఉంటాయి. అవి తక్కువ కాంతి వాతావరణంలోనే పనిచేస్తాయి.అలాంటి కంటి నిర్మాణం వల్ల పగటిపూట సరిగా చూడలేదు.రాత్రి పూట బాగా చూడగలదు.అలా చూడటమే కాకుండా దాని లోని అత్యుత్తమ వినికిడి శక్తితో తనకు ఆహారమైన జంతువుల అలికిడిని గుర్తించి వేటాడుతుంది.
అయితే గుడ్లగూబ ప్రవర్తనను అజ్ఞాని ప్రవర్తన అని మనుషులను గుడ్లగూబతో పోలుస్తూ చెబుతారు. ఎందుకంటే గుడ్లగూబకు పగలు, సూర్యకాంతి నచ్చదు. పైగా చూడనూ లేదు.రాత్రినే ప్రపంచంగా భావిస్తుంది.చీకటినే ప్రేమిస్తుంది. వెలుగులోకి రావడానికి ఇష్టపడదు.
అజ్ఞాని అయిన మనిషి కూడా అంతే. వెలుగు లాంటి జ్ఞానాన్ని ఇష్టపడడు.అజ్ఞానమనే చీకట్లో ఉండటానికే ఇష్టపడతాడు.అలాంటి వారిని ఉద్దేశించి మన పెద్దలు ఈ "దివాంధ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ సందర్భంగా వేమన రాసిన పద్యాన్ని గుర్తు చేసుకుందాం....
"చెవిని నిలుగట్టి చెప్పెను వేమన/బట్టబయల నుండు బ్రహ్మ మనుచు/ బుద్ధి గలిగి యందు బొంది సుఖించుడీ/విశ్వధాభిరామ వినురవేమ!!" అనగా బ్రహ్మము అనేది ఎక్కడో లేదు బట్టబయల నుండు అంటే వెలుగులోనే వుంటుంది. అది తెలుసుకొమ్మని వేమన చెవిలో ఇల్లు గట్టి మరీ చెప్పాడు. అది గ్రహించి సుఖంగా ఆనందంగా ఉండమని అంటున్నాడు.అందులోని విషయాన్ని గ్రహిద్దాం.
ఇక విషయానికి వద్దాం. తెలిసీ తెలియని అజ్ఞానమో, కనిపించనితనమో, కళ్ళకు అంటిన అహమో ,సత్యం న్యాయము, యథార్థమంటే ఉలికిపాటో, చీకటి పనులకు అలవాటు పడిన దుష్టత్వమో కొందరిని సూటిగా వెలుగులోకి రానీయవు. ధైర్యంగా తలెత్తుకుని పగటిపూట బతకనీయవు. అలాంటి వారివి ఎప్పుడూ వెలుగు పొడ అంటని చీకటి బతుకులే అని చెప్పవచ్చు.
సృష్టిలో గుడ్లగూబది రాత్రిపూట జీవితం.దాని వల్ల ఎవరికీ ఎలాంటి హాని లేదు.మనం మనుషులం.పై లక్షణాలతో సభ్య సమాజంలో చీడగానో,పీడగానో మారకూడదు కదా!
కాబట్టి వాటిల్లో ఏ ఒక్క అవగుణం, అవలక్షణం ఉన్నా వెంటనే సరిచేసుకోవాలి.అప్పుడే ఉదయపు అందాలను ఆనందాలను అందరితో కలిసి సమానంగా అనుభవించగలం."దివాంధ న్యాయము" లోని అంతరార్థం ఇదే.అది తెలుసుకుని మనల్ని మనం చక్కగా మలుచుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి